రవి శాస్త్రికి బీసీసీఐ గుడ్‌ న్యూస్..!

రవి శాస్త్రికి బీసీసీఐ గుడ్‌ న్యూస్..!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌తో పదవీకాలం ముగిసిపోయింది.. ఆ తర్వాత వెస్టిండీస్ టూర్‌ కోసం రవిశాస్త్రి పదవిని పొడిగించారు. అయితే, ఈ లోపే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది బీసీసీఐ.. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్‌లో మిగిలినవారిని కపిల్ దేవ్ కమిటీ ఇంటర్వ్యూలు చేసి కోచ్‌ను ఎంపిక చేసింది. మరోసారి రవిశాస్త్రినే భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. ఇక, టీమిండియా కోచ్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ... టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వార్షిక వేతనం భారీగ పెరగనుంది. దాదాపు 20 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు సహాయ సిబ్బంది వేతనాలు సైతం పెరిగాయి. గతేడాది వరకు ఏడాదికి 8 కోట్లు రవిశాస్త్రికి చెల్లించేది బీసీసీఐ. ఇప్పుడు ఆయన వార్షిక వేతనం 20 శాతం మేర పెరిగింది. దీంతో 10 కోట్ల వరకు వేతనం పొందే అవకాశం ఉంది.