రాహుల్ మెప్పు పొందిన తెలంగాణ పోలీస్

రాహుల్ మెప్పు పొందిన తెలంగాణ పోలీస్

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా వ్యవహరిస్తుంది తెలంగాణ పోలీస్ విభాగం. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ, పలువురి మెప్పు పొందుతున్నారు. రాష్ట్రంలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకిగానూ ఆదివారం ప్రాథమిక పరీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో 966 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. అయితే ముజీబుర్ రహ్మాన్ అనే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ నగర్ లోని బాలుర జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద పరీక్షల డ్యూటీ నిర్వర్తిస్తున్నాడు. పరీక్ష రాసేందుకు చంటి బిడ్డతో ఓ తల్లి వచ్చింది. ఆమెను పరీక్ష రాసేందుకు లోపలికి పంపించి చిన్నారి ఆలనపాలన తానే చూసుకున్నాడు. తల్లి లోపల పరీక్ష రాస్తుంటే, ఏడుస్తున్న ఆ చిన్నారి జోలపాట పాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ విషయాన్ని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వెంటనే చాలా మంది స్పందించి తన కామెంట్స్ పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ సైతం స్పందించారు. మానవత్వం ఇంకా బ్రతికే ఉంది, ఆ పోలీస్ కు సెల్యూట్, మానవత్వపు విలువలు పోలీసుల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి. ఇలా చాలా మంది తమ కామెంట్లును ట్వీట్ చేశారు.