మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ.. దొరికిపోయిన హెచ్‌ఎం..

మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ.. దొరికిపోయిన హెచ్‌ఎం..

ఆమె ఓ స్కూల్‌కు హెడ్ మాస్టర్.. జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుపై మనసు పడింది.. దీనికి పెద్దస్థాయిలో రికమండేషన్ చేస్తే వెంటనే పోస్టు కొట్టేయొచ్చనే ఆలోచనకు వచ్చింది.. ఆ వెంటనే మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ రికమండేషన్ లెటర్‌ను సృష్టించింది.. చివరకు దొరికిపోయిన ఘటన సంచలనం సృష్టించింది... వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా రావులపెంట గ్రామంలో హెచ్ఎంగా పనిచేచేస్తున్నారు మంగళ.. ఉన్నతస్థాయి పోస్టు కోసం అఢ్డదారులు తొక్కారు. ఇందుకోసం ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసింది.. జిల్లా కో ఆర్డినేటర్ పోస్టు కోసం ఈ కక్కుర్తికి పాల్పడ్డారు. కేటీఆర్ ఇచ్చినట్లు రికమండేషన్ లెటర్ సృష్టించి విధుల్లో చేరారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ విచారణకు ఆదేశించడంతో... దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు.