మటన్ ప్రియులకు శుభవార్త... 

మటన్ ప్రియులకు శుభవార్త... 

దేశంలో నాన్ వెజ్ తినేవాళ్లు భారీ సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే.  నాన్ వెజ్ అంటే చికెన్ ఒక్కటే కాదు.  అందులో మటన్ కూడా ఉంటుంది.  అయితే చికెన్ ను లైక్ చేసినంతగా మటన్ ను లైక్ చేయరు.  మటన్ లో అనేక గొప్ప గుణాలు ఉన్నాయని ఇటీవల పరిశోధనలో తేలింది.  మటన్ ను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మటన్ లో బి1, బి2, బి3, బి9, బి12 విటమిన్లు ఉంటాయి. విటమిన్‌-ఇ, కె కూడా ఉండటం విశేషం.  అలానే, ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరానికి చాలా అవసరం.  ఇందులో ప్రోటీన్లు, బి 12 ఎక్కువగా ఉండటం వలన శరీరంలో అనవసరంగా ఉండే కొవ్వును కరిగించడంలో ఇవి సహాయం చేస్తాయి.  బి 12 ఎక్కువగా ఉండటం వలన శరీరంలో ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి సహాయం చేస్తుంది.  అలానే దెబ్బతిన్న రక్తకణాల స్థానాల్లో కొత్తవి ఏర్పాటు  చేయడానికి సహాయపడుతుంది.  మటన్ ను తీసుకోవడం వలన గర్భిణులకు చాలా మంచిది.  అలానే మటన్ ను ఆహారంగా తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.  మటన్ ఆహారంలో తగిన మోతాదులో తీసుకుంటే... టైప్ 2 డయాబెటిస్, ఇతర వ్యాధుల నుంచి బయటపడొచ్చు.  మటన్ లో పొటాషియం, తగిన మోతాదులో సోడియం ఉండటం వలన రక్తపోటు, గుండెపోటు, మూత్రపిండాల సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు.