కాకరతో ఈ సమస్యలు దగ్గరికి కూడా రావు..!

కాకరతో ఈ సమస్యలు దగ్గరికి కూడా రావు..!

కాకరకాయ పేరు వినగానే చాలా మంది అబ్బో అంటారు. దాన్ని తినడం కాదు కదా...చూడటానికి ఇష్టపడరు. కానీ కాకర కాయతో అనేక లాభాలు ఉన్నాయి. నిజానికి కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నప్పటికీ పోషక, ఔషధ, గుణాల్లో మాత్రం ఎంతో ఉత్తమమైనది.

ఉపయోగాలు :

  • కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరిచేరవు.
  • శ్వాస కోస సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో కాకర రసం బాగా పని చేస్తుంది. తరచుగా కాకరకాయ తింటే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు
  • కాలిన గాయాలను ,పుండ్ల ను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి .రక్తాన్ని శుధ్ధి పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.
  • బరువు తగ్గాలనుకున్నా ,శరీరం లో అనవసర కొవ్వు కరగాలన్నా కాకర రసం తాగాలి . కాకరలో ని యాంటీ ఆక్సిడెంట్ లు ఆరోగ్యాన్నీ కాపాడుతాయి
  • ఉదర సంబంధ వ్యాధులను కాకర మంచి ఔషధం .అందుకే రుచిలో చేదుగా ఉన్నా కాకరను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది.