కరివేపాకుతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్‌..!

కరివేపాకుతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్‌..!

కరివేపాకు అంటే తెలియని వారుండరు. సాధారణంగా కరివేపాకు రోజు మనం తినే కూరల్లో వేసుకుంటాం. అయితే.. ఈ కరివేపాకుతో ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి. కానీ మనం ఈ కరివేపాకును తినకుండా తిసేస్తాం. అలా పడేయకుండా వీలైతే ఆకును కూడా ఆహారంలో కలుపుకుని నమిలేయండి.  

కరివేపాకు వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ ప్రయోజనాలివే..

 • కరివేపాకు అజీర్ణాన్ని అరికట్టి ఆకలిని పెంచుతుంది. కాబట్టి.. సమయానికి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. 
 • కరివేపాకు జీర్ణాశయ సమస్యలను నియంత్రిస్తుంది.
 • విరేచనాలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా కరివేపాకును తీసుకోండి.
 • శరీరంలోని అనారోగ్యకరమైన కొవ్వును తగ్గిస్తుంది. కాబట్టి గుండెకు మేలు జరుగుతుంది. బరువు కూడా తగ్గొచ్చు.
 • కరివేపాకులోని లాక్సేటివ్ లక్షణా మలబద్దకాన్ని నివారిస్తాయి.
 • మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలను కరివేపాకు నియంత్రిస్తుంది.
 • పేగులు, పొట్ట కండరాలను బలోపేతం చేయడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది.
 • క్యాన్సర్ ప్రేరేపితం కారకాలను కరివేపాకు నియంత్రిస్తుంది. 
 • కరివేపాకులో ఉండే కార్బోజోల్ ఆల్కలాయిడ్ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది.
 • శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్‌లకు గురి కాకుండా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
 • డయేరియాను కరివేపాకు నయం చేస్తుంది.
 • ఫుడ్ పాయిజనింగ్‌ సమస్యను కరివేపాకు తగ్గిస్తుంది.
 • చెమట, శరీర దుర్వాసనను కూడా కరివేపాకు నివారిస్తుంది.
 • కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.