సీజేఐ లైంగిక వేధింపులపై వచ్చేవారం విచారణ

సీజేఐ లైంగిక వేధింపులపై వచ్చేవారం విచారణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ ముగిసింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది త్రిసభ్య ధర్మాసనం. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నాతో కూడిన ధర్మాసనం నేతృత్వంలో విచారణ జరిగింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎలాంటి న్యాయపరమైన ఆదేశాలు ఇవ్వలేమన్న జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. ఆరోపణలను ప్రచురించిన  మీడియా సంస్థల స్వతంత్రత, విచక్షణకే  వదిలేస్తున్నామన్న ధర్మాసనం.. ఈ వార్తలను తొలగించాలంటూ పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను మరో సీనియర్ న్యాయమూర్తి పరిశీలనకు పంపుతానన్నారు సీజేఐ రంజన్ గొగోయ్. దీంతో విచారణ ముగియగా... తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని విడుదల చేసింది సుప్రీంకోర్టు. అయితే, ముగ్గురు సభ్యులు కలిగిన ధర్మాసనంలో ఆరోపణలు ఎదుర్కొంటున రంజన్ గొగోయ్ కూడా ఉండడంతో ఆయన సంతకం చేయకుండానే.. మిగతా ఇద్దరు జడ్జిలు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నా సంతకాలు సుప్రీంకోర్డు ఆర్డన్‌ను విడుదల చేశారు.