నిప్పులగుండంలా ఏపీ: ఆ జిల్లాలో 47 డిగ్రీలు!

నిప్పులగుండంలా ఏపీ: ఆ జిల్లాలో 47 డిగ్రీలు!

ఆంధ్రప్రదేశ్‌ నిప్పులగుండంలా మండిపోతోంది. ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా 42 ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలు నమోదైంది. 85 ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీలు, 480 ప్రాంతాల్లో 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా త్రిపురాంత‌కంలో అత్యధికంగా 47.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇవాళ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు..

ప్రకాశం జిల్లా..

  • త్రిపురాంతకంలో 47.10 డిగ్రీలు 
  • ముండ్లమూరులో 46.51
  • పెద‌చెర్లోపల్లిలో 46.41 

చిత్తూరు జిల్లా..

  • విజ‌య‌పురంలో 46.17
  • తిరుప‌తిలో 43.40 
  • ఏర్పేడులో 45.72
  • నాగ‌లాపురంలో 45.58 


నెల్లూరు జిల్లా పొద‌ల‌కూరులో 46.15..
గుంటూరు జిల్లా మాచ‌వ‌రంలో 45.55.. 
క‌ర్నూలు న‌గ‌రంలో 45.51.. 
క‌డ‌ప జిల్లా కొండాపురంలో 45.16.. 
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో 45.12