ఈ 3 రోజులూ జాగ్రత్తగా ఉండండి..

ఈ 3 రోజులూ జాగ్రత్తగా ఉండండి..

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. భానుడి భగభగలు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మూడు రోజులూ వడగాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక.. నిన్న ఖమ్మం జిల్లా పమ్మిలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.