మధ్యప్రదేశ్ మండిపోతోంది

మధ్యప్రదేశ్ మండిపోతోంది

ఒకవైపు నైరుతి రుతుపవననాలు ఇవాళ కేరళను తాకడంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఉత్తరాదిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్ధితి నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఇవాళ 48.06 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో అక్కడి జనం భయపడిపోతోన్నారు. అదే సమయంలో చిన్‌ద్వారాలో 23.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. దేశవాయువ్య ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో రానున్న రెండు, మూడు రోజులలో తీవ్ర వడగాల్పులతో పాటు ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు వరకు పెరిగే అవకాశముందని హెచ్చరించింది. మరోవైపు ఉత్తర కేరళ, తమిళనాడు తీరం, పుదుచ్చేరి, కర్నాటక, లక్ష్యదీవుల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.