వరంగల్: గంజాయి పట్టివేత

వరంగల్: గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుంచి గుట్టచుప్పుడు కాకుండా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ క్రమములో వారి నుండి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఎన్నికల గ్రామానికి చెందిన ముద్దు సతీశ్‌ అక్రమంగా గంజాయి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసుల సాయంతో సతీష్ ఇంటిపై దాడి చేసి 8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సతీశ్‌ను విచారించగా విశాఖపట్నం జిల్లా తాడేరుకు చెందిన శేఖర్ వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు తెలిపాడు.