గోదావరికి పెరుగుతున్న నీటి మట్టం

గోదావరికి పెరుగుతున్న నీటి మట్టం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క రోజులోనే గోదావరి నీటి మట్టం నాలుగున్నర అడుగుల ఎత్తు పెరిగింది. భద్రాచలం వద్ద మంగళవారం 26 అడుగులు ఉండగా.. ఈ రోజు ఉదయం 30.6 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, తెలంగాణాలో కూడా వర్షాలు ఇంకా కురుస్తూనే ఉండటంతో నేటి సాయంత్రానికి మరో 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరద ఉధృతి భారీగా ఉండటంతో తాలిపేరు ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టు వరద నీటిని కూడా దిగువకు వదిలారు. వరద ఉధృతి కారణంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.