గోదావరికి భారీ వరద ప్రవాహం

గోదావరికి భారీ వరద ప్రవాహం

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నదులు, చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఎగువన కూడా వర్షాలు కురుస్తుండటంతో ఈ తాకిడి మరింత ఎక్కువగా ఉంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 43.5 అడుగులకు నీటిమట్టం చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతమైన కొత్తకాలనీలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. భద్రాద్రి రామాలయం వద్ద పడమర మెట్ల వరకు వర్షపు నీరు  చేరింది.