తాలిపేరుకు భారీ వరద.. గేట్లన్నీ ఎత్తివేత

తాలిపేరుకు భారీ వరద.. గేట్లన్నీ ఎత్తివేత

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, చుట్టుపక్కల కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో వరద ఉదృతి మరింతగా పెరుగుతోంది. ఈ భారీ వర్షాలతో తెలంగాణలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరగడంతో నీటిమట్టం 72.31 మీటర్లకు చేరుకుంది. దీంతో గేట్లు అన్ని ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4,380 క్యూసెక్కులుగా కాగా ఔట్ ఫ్లో 4,196 క్యూసెక్కులుగా ఉంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి మూడు అడుగులు పెరిగింది. నిన్న ఉదయం 29 అడుగులు దాటిన నీటి మట్టం ఆదివారం ఉదయం 33 అడుగులకు చేరింది. గోదావరి నదిలో గంటగంటకూ వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.