శ్రీశైలంకు భారీ వరద

శ్రీశైలంకు భారీ వరద

రుతుపవనాలు చురుగ్గా కదలడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణ నది పొంగిపొర్లుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల మీదుగా భారీ వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి లక్షా 52 వేల 450 క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజీ నుంచి 45 వేల క్యూసెక్కులు.. మొత్తం లక్షా 97 వేల 450 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి. రోజుకు సుమారు 15 టీఎంసీల వరకు నీరొస్తోంది. వరద ఉదృతి ఇలాగే ఉంటే 15 రోజుల్లోగా ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు చేరుతుందని శైలం ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. అనంతరం వచ్చే వరద నీటిని గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేయనున్నారు.