విజయవాడలో భారీగా పట్టుబడ్డ గంజాయి

విజయవాడలో భారీగా పట్టుబడ్డ గంజాయి

విజయవాడ సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇసుక లారీలో అక్రమంగా తరలిస్తున్న 1137 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు ఇసుక లారీలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న డీఆర్ఐ.. పక్కా ప్రణాళిక ప్రకారం గంజాయిని పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2.27 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నర్సిపట్నం ఏజెన్సీ సాపర్ల నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.