హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం...

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం...
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్‌చెరులో భారీ వాన కురిసింది. మారేడ్‌పల్లి, తుకారంగేట్, అడ్డగుట్ట, చిలకలగూడ, తార్నాక, నాచారం, హబ్సిగూడ, లాలాపేట్, మల్లాపూర్, కుషాయిగూడ, ఈసీఐఎల్, నాగారం, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కార్ఖానా, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మోండా మార్కెట్, బేగంపేట్, రసూల్‌పురా, సనత్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, సంతోష్‌నగర్, సరూర్‌నగర్, బంజారాహిల్స్, బషీర్‌బాగ్, అబిడ్స్, లక్డీకాపూల్, నాంపల్లి, పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వాహనదారులు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో.. కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. ఉదయం నుండి భానుడు తన ప్రతాపం చూపించడంతో వేడిక్కిన వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. దీంతో ఉక్కపోత నుండి నగర వాసులకు కొంత ఉపశమనం లభించింది.