విజయవాడలో భారీ వర్షం

విజయవాడలో భారీ వర్షం

నైరుతి ఋతుపనాలు ఏపీలో ప్రవేశించడంతో భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా విజయవాడను భారీ వర్షం ముంచెత్తుతుంది. నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలతో.. మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వర్షాలపై కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసిన విజయవాడ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.
# మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం - 08672 - 252847
# మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయం - 08672 - 252486
# గుడివాడ ఆర్డీఓ కార్యాలయం - 08674 243697
# నూజివీడు ఆర్డీఓ కార్యాలయం - 08656-232717
# విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం - 0866 - 2576217
# విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ - 0866 - 2474801
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు:
అత్యధికంగా మండవల్లిలో 13 సెంటీమీటర్లు... మచిలీపట్టణంలో 11 సెంటీమీటర్లు.. గూడూరులో 10 సెంటీమీటర్లు... చల్లపల్లి, పెదపారుపూడి, ముదినేపల్లి, పెనమలూరు లలో 9 సెంటీమీటర్లు... కోడూరులో 8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది.