విశాఖలో భారీ వర్షాల బీభత్సం...

విశాఖలో భారీ వర్షాల బీభత్సం...

విశాఖ నగరంలో ఇవాళ తెల్లవారుజామునుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం సమయంలో భారీ వర్షాలు పడటంతో ఆఫీసులకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ భారీ వర్షాలతో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రోడ్లపైనే కాకుండా కేజీహెచ్ చిన్నపిల్లల వార్డులోకి మోకాళ్ల లోతు వర్షం నీరు చేరింది. విశాఖ జ్ఞానపురంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా నీరు చేరడంతో.. సింధియా, గాజువాక రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక్కడ దాదాపు రెండు గంటల పాటు రెండు బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. బస్సు కదలలేని స్థితిలో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. మరో నాలుగు రోజులు వర్షసూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

https://www.youtube.com/watch?v=ubArzXr_BJk