హైదరాబాద్ లోని పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లోని పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కూకట్‌పల్లి, గచ్చీబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం పడుతుంది. ఆకస్మిక వర్షంతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు గాలి దుమారం రేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం ప్రాంతాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా విద్యుత్ నిలిచిపోయింది. కీసర, దమ్మాయిగూడ, నాగారం, కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి, ఈసీఐఎల్ చౌరస్తా, ఏఎస్ రావు నగర్, నేరేడ్‌మెట్ తోపాటు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలుతో కూడిన వర్షం పడుతోంది.