హైదరాబాద్‌లో భారీ వర్షం..

హైదరాబాద్‌లో భారీ వర్షం..

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. కుంభవృష్టిగా కురిసిన వర్షానికి చెట్లు నేలకూలాయి. ఉప్పల్, తార్నాకాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. సైనిక్‌పురిలో వడగళ్లవానతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివానతో పలు చోట్ల చెట్లు రోడ్లపై కూలిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో ఈదురుగాలులలో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంతా కారు మబ్బులు కమ్ముకోవడంతో నగరం చీకటిమయంగా మారింది. సాయంత్రం 5గంటలకే వాతావరణమంతా మబ్బులతో చల్లబడింది. నగరంలోని శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఈఎస్‌ఐ, ఎస్సార్‌నగర్‌, మైత్రివనం, మాదాపూర్‌, సోమాజిగూడ, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇక ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, కుషాయిగూడ, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కూడా బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడింది.