పలకరించిన తొలకరి.. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో వర్షాలు..

పలకరించిన తొలకరి.. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో వర్షాలు..

తెలంగాణను తొలకరి పలకరించింది.. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి... హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. జంట నగరాలతో పాటు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, అమీర్‌పేట్‌, బేగంబజార్, కోఠి, సుల్తానుబజార్, అబిడ్స్, బషీర్ బాగ్, అసెంబ్లీ, మెహదీపట్నం, గోషామహల్‌ ఇలా నగరవ్యాప్తంగా వర్షం కురుస్తోంది.. ఇక, శివారులోని ఈసీఐఎల్, నాగారం, జవహార్ నగర్, కీసర, దమ్మాయిగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, సంతోష్‌నగర్‌, బడంగ్‌పేట్‌, బాలాపూర్‌ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రంగంలోకి దిగింది జీహెచ్‌ఎంసీ. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. వర్షం నీరు భారీగా చేరే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.