రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..

బంగాళఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల వచ్చే మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి విదర్భ మధ్య వాయుగుండం కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో ఈనెల 19 వరకు తెలుగురాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో భూపాలపల్లిలో 19 సెం.మీ, కొమురంభీం జిల్లాలో 17 సెం.మీ, ఆసిఫాబాద్ లో 13 సెం.మీ, కాళేశ్వరంలో 11 సెం.మీ, ఉట్నూరు, ఆదిలాబాద్ లో 11  సెం.మీ, మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, మంథనిలో 11 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.