మరో 2 రోజులు భారీ వర్షాలు

మరో 2 రోజులు భారీ వర్షాలు

రుతుపవనాల జోరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాల సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ అధికారులు తెలిపారు.