మరో అల్పపీడనం : రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

మరో అల్పపీడనం : రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 24 గంటలలో వాయువ్య  బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో  బలపడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు చాలా చోట్ల మరియు రేపు, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఈరోజు  ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు  మరియు ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.