మరో రెండు రోజులు భారీ వర్షాలు...

మరో రెండు రోజులు భారీ వర్షాలు...

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా భూపాలపల్లిలో 45.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామగుండంలో 45, పెద్దపల్లిలో 39.4, భద్రాద్రి కొత్తగూడెంలో 32, ఆదిలాబాద్‌లో 30.3, వరంగల్ రూరల్‌లో 27.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.