విజయవాడ, వరంగల్ హైవే పై రద్దీ

విజయవాడ, వరంగల్ హైవే పై రద్దీ

దసరా సెలవులు నేటితో ముగియడంతో  వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన వారు తిరిగి భాగ్యనగరం బాటపట్టారు. దీంతో విజయవాడ, వరంగల్ హైవే పై రద్దీ నెలకొంది. ఆదివారం మొత్తం జాతీయ రహదారి వాహనాల తాకిడితో రద్దీగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఈ సాయంత్రం భారీ రద్దీ నెలకొన్నది. దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాలకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యారు. వస్తున్న వాహనాలతో టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆరు కౌంటర్లకు తోడు మరో రెండు కౌంటర్లు తెరిచారు.