నగరంలో 13 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్

నగరంలో 13 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్

హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్ గ్రీన్ ల్యాండ్స్ బ్రిడ్జ్ పై రెండు భారీ వాహనాలకు బ్రేక్ డౌన్ అయింది. దీంతో బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోవడంతో మాదాపూర్ నుండి సికింద్రాబాద్ వరకు13 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్, జూబ్లీ  హిల్స్ చెక్ పోస్ట్, పంజాగుట్ట, బేగంపేట, పారడైస్ వరకు ట్రాఫిక్ స్తంబించిపోయింది. దీంతో గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు వాహన దారులు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.