అర్జున్ రెడ్డి తరహాలోనే.. హెబ్బా రెచ్చిపోయిందిగా..!!

అర్జున్ రెడ్డి తరహాలోనే.. హెబ్బా రెచ్చిపోయిందిగా..!!

బోల్డ్ కంటెంట్ తో వచ్చి యువతను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి.  డిఫరెంట్ ఆటిట్యూడ్ తో.. వెరైటీ మ్యానరిజంతో విజయ్ ఆకట్టుకున్నాడు. ఇదే తరహాలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా కూడా సూపర్ హిట్టైంది.  ఇప్పుడు హెబ్బా పటేల్ 24 కిసెస్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.   సినిమా టైటిల్ చూస్తుంటేనే ఇది ముద్దులతో ముంచెత్తే సినిమా అని అర్ధం అవుతున్నది.  

దీనికి తగ్గట్టుగానే ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ నిండా ముద్దులే కనిపించాయి.  ఇంగ్లీష్ ముద్దుల సంస్కృతి టాలీవుడ్ వరకు పాకడంతో.. మనవాళ్ళు కూడా ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ముద్దు సీన్స్ లో నటిస్తున్నారు.  ట్రైలర్ కు సెన్సార్ కట్ లు ఉండవు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంటె.. సినిమా సగం హిట్టయినట్టే.  ట్రైలర్ ను అందంగా కట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  24 కిసెస్ ట్రైలర్ లో ఎక్కువ భాగం ముద్దులతోనే నిండిపోయింది.  ఇది కేవలం శాంపిల్ మాత్రమే అంటున్నారు.  అంతకు మించి సినిమాలో ఉంటుందని చెప్తున్నారు.  మిణుగురులతో జాతీయ అవార్డును అందుకున్న అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి.. తన రెండో సినిమానే ఈ రేంజ్ ముద్దులతో ఉండే సినిమా తీస్తున్నాడు ఆయనలో ఎంత కమర్షియల్ కసి ఉందొ అర్ధం చేసుకోవచ్చు.