నదిలో కూలిన హెలికాప్టర్ః వైరల్

నదిలో కూలిన హెలికాప్టర్ః వైరల్

న్యూయార్క్ లోని ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు హడ్సన్ నదిలో కూలిపోయింది. మాన్‌హట్టన్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ అదుపుతప్పిన హడ్సన్‌ నదిలో పడిపోవడాన్ని చూసిన పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పైలట్‌, డాక్‌ వర్కర్‌కు మాత్రం స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.