కేరళ సాయానికి నిజామాబాద్ విరాళం

కేరళ సాయానికి నిజామాబాద్ విరాళం

వరద నష్టం నుంచి బయటపడేయడానికి కేరళకు ఆపన్న హస్తాల సాయం అందుతూనే ఉంది. పలు రాష్ట్రాల నుంచి ఇప్పటికే భారీ ఎత్తున విరాళాలు వెల్లువెత్తాయి. తెలంగాణ నుంచి కూడా పెద్దఎత్తున నిత్యావసర వస్తువులు, ఆర్థిక సాయం పంపించారు. అదే క్రమంలో తాజాగా నిజామాబాద్ నుంచి పలువురు వ్యాపారవేత్తలు, ఎంపీ కవిత అభిమానులు రూ. 4 లక్షల 91 వేల చెక్కును సీఎం సహాయ నిధికి పంపించారు. ఈ విషయాన్ని ఎంపీ కవిత ట్విట్టర్లో పేర్కొన్నారు.