ఓట్ల కోసం హేమమాలిని పాట్లు

ఓట్ల కోసం హేమమాలిని పాట్లు

ఎన్నికల్లో టికెట్ పొందడానికి, దానికోసం అధిష్టానాన్ని ఆకట్టుకోడానికి రాజకీయ నాయకులు పడే పాట్లు మామూలుగా ఉండవు. టికెట్‌ వచ్చాక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారితో మమేకమైపోతారు. అప్పటి వరకూ అలవాటు లేని పనులను కూడా అలవోకగా చేసేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నటి హేమమాలిని కూడా ఓట్ల కోసం 'ఫిల్డ్‌'లోకి దిగారు. నిన్ననే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆమె.. మహిళా ఓటర్లపై ఫోకస్‌ పెట్టారు. నియోజకవర్గంలోని గోవర్దన ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఆమె.. దారిలో కనిపించిన మహిళా రైతులకు వరి కోతలో సాయం చేశారు.