క్షణంలో సీఎం అవుతా...

క్షణంలో సీఎం అవుతా...

ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ హేమామాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే నిమిషంలో సీఎం కాగలనని, కానీ ఆ పదవిపై ఆసక్తి లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ మధుర నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇటీవల రాజస్థాన్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే దాన్ని మీరు స్వీకరిస్తారా అని విలేకరులు అడగ్గా, నేను కావాలనుకుంటే ముఖ్యమంత్రి కాగలనని అన్నారు. కేవలం నిమిషంలో ఆ పదవిని అలంకరిస్తా, కానీ నేను ఆ పదవితో ముడిపడి ఉండడానికి ఇష్టపడడం లేదని తెలిపింది. దానితో నాకు పోరాడే స్వేచ్చ ముగిసిపోతుందని సమాధానమిచ్చింది. తన గ్లామర్ వల్లే ఎంపీ అయ్యే అవకాశం వచ్చిందని, బాలీవుడ్ సినిమాల్లో నటించినందు వల్ల డ్రీమ్ గర్ల్ గానే తాను అందరికి తెలుసనని అన్నారు. తాను పార్లమెంట్ వెళ్లడానికి ముందు నుంచే బీజేపీ కోసం పని చేశానని చెప్పారు.