అత్యంత దారుణంగా నా కొడుకును హత్య చేశారు : హేమంత్‌ తండ్రి

అత్యంత దారుణంగా నా కొడుకును హత్య చేశారు : హేమంత్‌ తండ్రి

హైదరాబాద్‌లో పరువు హత్య కేసు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. అల్లుడిని కిరాతకంగా హత్య చేయించాడు. ఈ పరువు హత్యపై హేమంత్‌ తండ్రి మురళీకృష్ణ స్పందించారు. ప్రేమ పెళ్లికి అవంతిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని...కులాంతర వివాహం కావడంతో వాళ్లకి ఇష్టం లేదని  హేమంతు తండ్రి మురళీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవంతిక కుటుంబ సభ్యులు వెళ్ళగోట్టడం,  పెళ్ళికి ఒప్పుకోకపోతే ఎక్కడికి వెళ్తారు అని తాము ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నానని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు బెదిరింపులకు పాల్పడితే పోలీసుల సమస్యలు రాజీ కుదిరిందని..నా కొడుకును చంపుతారని ఊహించలేదని తెలిపాడు మురళీకృష్ణ.  అత్యంత దారుణంగా నా కొడుకును హత్య చేశారు...నా కొడుకును హత్య చేసిన వారిని వదిలి పెట్టవద్దు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.