కులం పిచ్చితో నా కొడుకును హత్య చేశారు : హేమంతు తల్లి

కులం పిచ్చితో నా కొడుకును హత్య చేశారు : హేమంతు తల్లి

హేమంత్‌ హత్యపై తల్లి రాణి స్పందించారు. నేనంటే నా కొడుకుకు ప్రాణం.. ఉదయం లేచినప్పటి నుండి తనతో మాట్లాడకుండా హేమంత్‌ ఉండలేడని తెలిపింది. మారుతీ రావు లాంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా సమాజంలో మార్పు రాలేదు..హేమంత్‌నును చంపుతారని అనుకోలేదని పేర్కొన్నారు. హేమంత్ ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి... అల్లారుముద్దుగా నా కొడుకులు పెంచుకున్నాను.. నాకు కడుపు కోత మిగిల్చారని తన బాధను తెలియజేసింది. అవంతిక తండ్రి ఎంత కఠినాత్ముడైన ఆమె తల్లికి విషయం తెలియదా.. ధన అహంకారము, కులం పిచ్చి తోటే నా కొడుకును హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు రెడ్డిలు మేము వైశ్యులమని చెప్పి నా కొడుకుని హత్య చేశారు..అవంతిక ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్లకు ఇచ్చేసామని తెలిపింది.  కన్న కూతురిలా అవంతికను చూసుకుంటున్నాను..మరో కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు.