భూమివైపు దూసుకొస్తున్న కొత్త తోకచుక్క... ఈనెల మొత్తం ఆకాశంలో ఇలా... 

భూమివైపు దూసుకొస్తున్న కొత్త తోకచుక్క... ఈనెల మొత్తం ఆకాశంలో ఇలా... 

భూమివైపు తోకచుక్కలు దూసుకు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అప్పుడెప్పుడో హేలీ అనే తోకచుక్క భూమివైపు దూసుకొచ్చినట్టు మనం చరిత్రలో చదువుకున్నాం. కాగా, ఇప్పుడు మరో తోకచుక్క భూమివైపు దూసుకొస్తున్నట్టు  శాస్త్రవేత్తలు గుర్తించారు.  వారం రోజుల క్రితం ఈ తోకచుక్క బుధగ్రహం కక్ష్యను దాటి సూర్యునివైపు వెళ్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.  అయితే, ఈ తోకచుక్క సూర్యుని అటుగా వెళ్లకుండా అక్కడి నుంచి దిశ మార్చుకొని భూమివైపు వస్తున్నట్టు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.  దీనిని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోని నియోవైజ్ శాటిలైట్ ద్వారా గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  ఈ తోకచుక్క ఐదు కిలోమీటర్ల పొడువు ఉండటంతో, మనకళ్ళతో కూడా చూడొచ్చని అంటున్నారు.  వచ్చే వారం భూమివైపుగా ఈ తోకచుక్క ప్రయాణం చేస్తుందని, రాత్రి వేళ ఉత్తరంవైపు ఆకాశంలో సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయం ముందు స్పష్టంగా కనిపిస్తుందని నాసా తెలిపింది.  వచ్చే వారం నుంచి ఈ నెల మొత్తం ఈ తోకచుక్క ఆకాశంలో కనువిందు చేయబోతున్నది.