మ‌రుగుజ్జును పెళ్లాడిన స్టార్ హీరోయిన్‌?

మ‌రుగుజ్జును పెళ్లాడిన స్టార్ హీరోయిన్‌?
కింగ్‌ఖాన్‌ షారూక్ సినిమాల‌న్నీ ఇటీవ‌లి కాలంలో డోలాయ‌మానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు ఇత‌ర హీరోలు వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతుంటే రెడ్ చిల్లీస్ అధినేత మాత్రం అంత‌కంత‌కు కిందికి వెళుతున్నాడు. ఈ ప‌రిణామం న‌చ్చ‌ని బాద్‌షా త‌న‌దైన శైలిలో స‌రికొత్త‌ ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు. ఈసారి ఆనంద్ ఎల్‌.రాయ్ వంటి మేటి ప్ర‌తిభావంతుడితో క‌లిసి ప‌నిచేస్తున్నాడు. స్క్రిప్టు ద‌శ‌నుంచే సెన్సేష‌న్స్‌కి ప్లాన్ చేశాడు బాద్‌షా. ఆ క్ర‌మంలోనే త‌న కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ గా మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్‌ని లాంచ్ చేశారు. టీజ‌ర్ చూడ‌గానే ఈ సినిమా గ్యారెంటీ హిట్ అని కింగ్ ఖాన్ అభిమానులు డిసైడైపోయారు. షారూక్ మ‌రుగుజ్జు పాత్ర‌లో అద్భుత విన్యాసాలు చేయ‌బోతున్నాడ‌ని అర్థ‌మైంది. ఇక ఈ సినిమా ఆన్ లొకేష‌న్ నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు లీకులు అందుతూనే ఉన్నాయి. తాజాగా జీరో సెట్స్ నుంచి క‌త్రిన కైఫ్ పెళ్లి కూతురు గెట‌ప్ ఒక‌టి లీకైంది. ఈ ఫోటోలో క‌త్రిన నిండుగా ప‌ట్టు చీర‌లో క‌నిపించింది. పైగా ఒళ్లంతా ఆభ‌ర‌ణాలు ధ‌రించి పెళ్లికూతురును త‌ల‌పిస్తోంది. ఈ లీకేజీ చూస్తుంటే మ‌రుగుజ్జు అయిన షారూక్‌ని క‌త్రిన పెళ్లాడే సంద‌ర్భం సినిమాలో ఉంటుందా? మూవీలో అదో ర‌కం ట్విస్ట్ అనుకోవ‌చ్చా? అంటూ అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వానికి ఈ సినిమాలో పెద్ద స్టార్ అయిన అనుష్క శ‌ర్మ‌ వెంట ప‌డే మ‌రుగుజ్జు పాత్ర‌లో షారూక్ న‌టిస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. అయితే ఈ సినిమాలో క‌త్రిన రోల్ ఏంటి? అనేది రివీల్ కాలేదింకా. డిసెంబ‌ర్ 21న `జీరో` రిలీజ్ కానుంది. స‌మాధానం కావాలంటే అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.