కళ్లద్దాలు ధరిస్తే కరోనా నుంచి బయటపడొచ్చా?
కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని దేశాలు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, యూరప్ దేశాల్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఇక ఇండియాలోనూ పాజిటివ్ కేసులు తిరిగి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇదిలా ఉంటె, నిత్యం కళ్ళజోడు వాడే వ్యక్తులకు కరోనా సోకె అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మాములుగా వైరస్ ముక్కు, గొంతు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మాస్క్ ధరించడం ద్వారా దీనిని కొంతమేర అడ్డుకట్ట వెయ్యొచ్చు. అయితే, కళ్ళ నుంచి కూడా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మాస్క్ తో పాటుగా కళ్ళజోడు ధరించిన వ్యక్తులకు వైరస్ సోకె ప్రమాదం తక్కువగా ఉంటుందని అంటున్నారు. కళ్ళజోడు ధరించిన వ్యక్తుల కంటే ధరించని వ్యక్తులు ఎక్కువసార్లు ముఖంతో పాటుగా కళ్ళను కూడా తాకుతుంటారు. ఫలితంగా కరోనా కళ్ళద్వారా శరీరంలోకి ప్రవేయిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)