వరల్డ్‌కప్‌కి సౌతాఫ్రికా జట్టు ప్రకటన

వరల్డ్‌కప్‌కి సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌కి దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. 15 మంది గల ఈ జట్టుకు ఫాఫ్ డుప్లెసిస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. పేలవ ఫామ్‌తో తడబడుతున్నప్పటకీ.. సీనియర్‌ ఆటగాడు హషీమ్‌ ఆమ్లాను ఎంపిక చేసిన 'క్రికెట్‌ సౌతాఫ్రికా'..యువ క్రికెటర్ రీజా హెన్‌డ్రిక్స్‌కు మొండిచేయి చూపించింది. ఇక.. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా క్రికెట్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. 

జట్టు వివరాలు: 
డుప్లెసిస్(కెప్టెన్), క్వింటన్ డికాక్‌(కీపర్), ఆమ్లా, వాన్ డెర్ దెస్సెన్, డేవిడ్ మిల్లర్, అండిలే పెహ్లుక్‌వాయో, డుమినీ, అన్రిచ్, డ్వెయిన్ ప్రెటొరియస్‌, మార్క్‌రం, స్టెయిన్, ఎంగిడి, ఇమ్రాన్ తాహీర్, తబ్రైస్ షంషీ