శివ తరువాత ఆ దర్శకుడే..

శివ తరువాత ఆ దర్శకుడే..

తమిళ హీరో అజిత్ 2014 లో దర్శకుడు శివతో వీరమ్ చేశాడు.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  దీని తరువాత 2019 వరకు వరసగా మూడు సినిమాల్లో ఆఫర్ ఇచ్చాడు.  ఈ మూడు హిట్టయ్యాయి.  2019 లో వచ్చిన విశ్వాసం సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.  

ఇప్పుడు అజిత్ దర్శకుడు హెచ్ వినోద్ తో సినిమా చేస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్టైన పింక్ సినిమాకు ఇది రీమేక్.  ఇప్పటికే 60శాతం షూటింగ్  పూర్తయింది.  రషెస్ చూసిన అజిత్ పూర్తి సంతృప్తిగా ఉండటంతో పాటు తన 60 వ సినిమాకు డైరెక్ట్ చేసే ఛాన్స్ హెచ్ వినోద్ కు అప్పగించినట్టు తెలుస్తోంది.  ఒకవేళ తనకు అప్పగించిన రెండు ప్రాజెక్టులు హిట్టయితే శివ తరువాత వరసగా డైరెక్ట్ చేసే ఛాన్స్ హెచ్ వినోద్ కొట్టేసినట్టే అవుతుంది.