పెళ్లి పత్రికలు పంచుతున్న హీరో ఆర్య !

పెళ్లి పత్రికలు పంచుతున్న హీరో ఆర్య !

తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ ప్రేమ వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే.  'అఖిల్' సినిమాతో నటిగా పరిచయమైన సాయేషా ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్లు అందుకుని అక్కడే సెటిలైపోయింది.  'గజినీకాంత్' సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.  పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోనున్నారు.  

పెళ్లి తేదీ దగ్గరపడుతుండటంతో ఆర్య తన స్నేహితులకు, ఇతర ప్రముఖులకు పెళ్లి పత్రికలు ఇస్తూ వివాహానికి ఆహ్వానిస్తున్నారు.  తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ హీరో విశాల్ ను కలిసి పత్రిక అందజేశాడు.  ఈ విషయాన్ని విశాల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.