ఆ సినిమా షూటింగ్ అంతా చీకటిలోనే...

ఆ సినిమా షూటింగ్ అంతా చీకటిలోనే...

మరో ప్రయోగాత్మక చిత్రానికి కార్తీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  కార్తీ హీరోగా ఖైదీ అనే సినిమా తెరకెక్కుతోంది.  జైలు శిక్ష పడి జైల్లో ఉన్న కార్తీ అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు.  తప్పించుకున్న తరువాత జరిగిన పరిణామాలు ఏంటి అనే దాని చుట్టూ కథ తిరుగుతుంది.  పాయింట్ చిన్నదే అయినప్పటికీ రెండు గంటలపాటు సినిమాను ఎలా నడిపాడు అన్నది తెలియాలి.  

62 రోజుల్లో సినిమాను పూర్తి చేశారు.  డే సమయంలో రెస్ట్ తీసుకొని కేవలం నైట్ మాత్రమే షూటింగ్ చేశారట.  ఇలా 62 రోజులు నైట్ మాత్రమే షూటింగ్ చేసుకున్న సినిమా బహుశా ఇదొక్కటే అయ్యి ఉంటుంది.    తెలుగులో మానగరం అనే సినిమాను తీసిన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు.  మానగరం తెలుగులో పెద్దగా ఆడకపోయినా తమిళంలో మంచి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.