నిమిషానికి 40 బైక్స్ అమ్మిన హీరో మోటో

నిమిషానికి 40 బైక్స్ అమ్మిన హీరో మోటో

టూ వీలర్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం సాధించిన హీరో మోటో కార్ప్ ఈ ఏడాది జనవరి నుంచి నిమిషానికి నలభై బైక్స్ ను అమ్మింది. మార్చితో ముగిసిన మూడు నెలలకు కంపెనీ తన పనితీరును ప్రకటించింది. 90 రోజుల్లో 20 లక్షల వాహనాలను అమ్మింది. ప్రతి డీలర్‌ తమ షాపును ఆదివారంతో సహా రోజుకు పది గంటలు తెరిచి ఉంచినట్లు లెక్కవేసినా.. నిమిషానికి నాలుగు బైక్స్ అమ్మినట్లయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 23 శాతం పెరిగాయి. కంపెనీ టర్నోవర్‌ రూ. 8564 కోట్లు కాగా.. రూ.717 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ ప్రకటించింది. 
ఏడాదికి 76 లక్షలు...
మొత్తం ఏడాది హీరోమోటో కార్ప్‌ 75.87.154 వాహనాలను అమ్మింది. పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 32,230 కోట్ల అమ్మకాలపై రూ. 3.697 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. ఒక్కో షేర్‌పై రూ.40 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది.