గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ లాక్..

గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ లాక్..

జెర్సీ తరువాత నాని చేస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్.  విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మూడు షెడ్యూల్ రీసెంట్ గా ప్రారంభమైంది.  జూన్ 30 వరకు సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి ఆగష్టు 30 వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  గ్యాంగ్ లీడర్ అనగానే చుట్టూ పదిమంది గ్యాంగ్ ను వేసుకొని బలాదూర్ గా తిరగడం అనుకుంటారు.  ఈ గ్యాంగ్ లీడర్ దానికి  విరుద్ధంగా ఉంటాడట.  

భిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను చిత్రీకరిస్తున్నారట.  ఆ భిన్నమైన కోణం ఏంటి అన్నది థియేటర్లోనే చూడాలని అంటున్నారు దర్శకుడు.  ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఓ ప్రముఖ పాత్రలో కనిపిస్తున్నాడు.  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.