భాద్యత కలిగిన హీరో నిఖిల్ !

భాద్యత కలిగిన హీరో నిఖిల్ !

రోజులు మారాయి.. జనాలకు ఎంటర్టైన్మెంట్ పొందడానికి బోలెడు దారులున్నాయి.  గతంలో వినోదం అంటే 3 గంటల సినిమా ఒక్కటే మార్గమనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు.  సినిమాను రూపొందించడం ఎంత కష్టమో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడం కూడా అంతే కష్టం.  ఈ కష్టాన్ని గుర్తెరిగిన హీరోలు కొంతమందే.  వాళ్లలో యువ హీరో నిఖిల్ కూడా ఒకరు.  షూటింగ్ అయిందా, డబ్బింగ్ చెప్పేశామా, ఓ రెండు ఇంటర్వ్యూలు ఇచ్చామా మన పని అయిపోయింది అనుకోకుండా సినిమా విడుదలై, థియేటర్లోంచి వెళ్లిపోయే వరకు నాకు కూడా భద్యత ఉంది అనుకునే హీరోలా మారారు.   

అందుకే మే 1న విడుదలకానున్న తన 'అర్జున్ సురవరం' సినిమా ప్రమోషన్ల భాద్యతను పూర్తిగా భుజాలకెత్తుకున్నాడు.  చిత్రంలో చేసిన ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్ పాత్రనే నిజజీవితంలో కూడా పోషిస్తూ ప్రముఖ ఛానెల్ టీవీ 9కు రిపోర్ట్ అయ్యాడు.  వీధుల్లో తిరుగుతూ జనం వద్దకు వెళ్లి రకరకాల విషయాలపై మాట్లాడుతున్నాడు.  అంతేకాదు త్వరలోనే రీసెంట్ ఎల‌క్ష‌న్స్ లో అంద‌ర్ని యూట్యూబ్ లో ఎంట‌ర్‌టైన్ చేసిన ఓ లీడ‌ర్ ని ఇంటర్వ్యూ  చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాడు.  ఇలా తను చేసే చిత్రాల వ‌ల్ల అటు నిర్మాత‌లు, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్స్, ఎగ్జిబ్యూట‌ర్స్ ఎవ‌రూ న‌ష్ట‌పోకూడదనే సదాభిప్రాయంతో పనిచేస్తున్న నిఖిల్ జయాపజయాలకు అతీతంగా నిజమైన హీరో అనిపించుకున్నాడు.