రేంజ్ రోవర్ కారు కొన్న నిఖిల్

రేంజ్ రోవర్ కారు కొన్న నిఖిల్

‘హ్యాపీ డేస్’ లాంటి హిట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో నిఖిల్ సిద్దార్థ్.. వరుస ప్లాపుల తర్వాత ‘స్వామిరారా’ హిట్ సినిమాతో నిఖిల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందనే  చెప్పాలి. చివరగా ‘అర్జున్ సురవరం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘18 పేజీస్’ సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ చేయనున్న ‘కార్తికేయ 2’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, తాజాగా నిఖిల్ కొత్త కారును కొన్నాడు. రేంజ్ రోవర్ కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. గతేడాది హీరో నిఖిల్- పల్లవి వర్మ వివాహబంధంతో ఒక్కటైనా విషయం తెలిసిందే.