చిరుతో పోటీ కి సిద్ధం అవుతున్న నితిన్..!!

చిరుతో పోటీ కి సిద్ధం అవుతున్న నితిన్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఆగష్టు 22 వ తేదీన ఆడియో, ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  మెగాస్టార్ సినిమా పైగా అంచనాలు ఉండటంతో.. మిగతా సినిమాలు ఏవి రిలీజ్ కు సిద్దపడటం లేదు.  

కానీ, నితిన్ హీరోగా చేస్తున్న భీష్మ సినిమా దసరాకు రిలీజ్ చేయడానికి సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది.  ఇందులో రష్మిక హీరోయిన్.  వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.  మరి సైరాను ఢీకొట్టి నిలబడగలుగుతుందా.. చూడాలి.