నాని నటనకు ఎన్టీఆర్ ఫిదా

నాని నటనకు ఎన్టీఆర్ ఫిదా

నానిని న్యాచురల్ స్టార్ అని ఎందుకు అంటారో జెర్సీ సినిమా చూస్తే యిట్టె అర్ధం అవుతుంది.  ఎమోషన్స్, లవ్ అన్నింటిని చాలా న్యాచురల్ గా పెర్ఫర్మ్ చేసి ఆకట్టుకున్నాడు.  కెరీర్లో ఫెయిల్యూర్ ఆయిన యువకుడిగా, ఫెయిల్యూర్ అయిన భర్తగా, కొడుకు అడిగిన కనీస కోరికను కూడా తీర్చలేని తండ్రిగా నాని చేసిన యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంటుంది.  

సామాన్యు ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల వరకు నాని నటనను మెచ్చుకుంటున్నారు.  ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా చేరిపోయారు.  నాని బ్రిలియంట్ నటనతో ఆకట్టుకున్నాడని, ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో నాని చేసిన పెరఫార్మన్స్ అవుట్ స్టాండింగ్ అని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.  పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నానికి జెర్సీ మంచి రిలీఫ్ ఇచ్చింది.