ఆందోళనకరంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం..కూతురు రిక్వెస్ట్ !

ఆందోళనకరంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం..కూతురు రిక్వెస్ట్ !

కరోనా మహమ్మారి  సామాన్యుడినుంచి సెలబ్రెటీలు వరకు అందరిని వణికిస్తోంది.  సినిమా రంగంలోను పలువురు కరోనా బారిన పడినవిషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ జంట రాజశేఖర్, జీవిత ఈ నెల 17 న కరోనా బారిన పడ్డారు.  వారం రోజుల క్రితమే కరోనా సోకినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే..జీవిత హోమ్ ఐసొలేషన్ లో ఉండగా రాజశేఖర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి నుంచి రాజశేఖర్ కు శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్వీట్ వైరల్ అయింది.   కరోనా తో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బందులు పడుతున్నారని, అందరి అభిమానంతో నాన్న క్షేమంగా తిరిగివస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తన ట్విట్టర్ లో కోరారు. ఆమె ట్వీట్ తో రాజశేఖర్ సన్నిహితులు కూడా ప్రార్థనలు చేస్తున్నారు.