సెట్స్ లో గాయపడిన హీరో రాజశేఖర్

సెట్స్ లో గాయపడిన హీరో రాజశేఖర్

గరుడవేగ సినిమా తరువాత రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి.  ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఇది కూడా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నది.  ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ గాయపడినట్టుగా సమాచారం.  భుజానికి గాయం అయినప్పటికీ రాజశేఖర్ షూటింగ్ కంప్లీట్ చేశారని అనంతరం హాస్పిటల్ కు వెళ్లారని యూనిట్ ద్వారా తెలుస్తున్నది.  

షూటింగ్ స్పాట్ లో గన్ ఫైరింగ్ కు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్టుగా సమాచారం.  సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  1980 ప్రాంతంలో జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.